బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా కొన్ని మ్యూజికల్ హిట్స్ ఎప్పటికీ జనం మదిలో చెరగని ముద్ర వేసుకొనే ఉంటాయి. అలాంటి వాటిలో సల్మాన్ ఖాన్, మనీషా కొయిరాల జోడీగా నటించిన ‘ఖామోషీ’ని గుర్తు చేసుకోవచ్చు. నిజానికి ఈ సినిమా పేరు వినగానే వీరికంటే ముందుగా నానా పటేకర్, సీమా బిశ్వాస్ గుర్తుకు వస్తారు. ఇందులో మూగ, చెవిటి పాత్రల్లో ఆ ఇద్దరూ అద్భుతమైన అభినయం ప్రదర్శించారు. వారి కూతురుగా మనీషా నటన సైతం ప్రశంసలు అందుకుంది.…
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ లోకి దర్శకుడు డేవిడ్ ధావన్ రీమేక్ చేయనున్నారు. కార్తీక్ ఆర్యన్-కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. హిందీ రీమేక్ వెర్షన్ కు అల్లు అరవింద్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన టబు పాత్రలో బాలీవుడ్‌లో మనీషా కొయిరాల చేయనుందట.…