తమిళ స్టార్ నటుడు సూరి మరియు తెలుగు నటుడు సుహాస్ కలిసి నటిస్తున్న కొత్త చిత్రం ‘మండాడి’ షూటింగ్ చెన్నై సముద్ర తీరంలో శరవేగంగా కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో దురదృష్టకరమైన అపశృతి జరిగింది. సముద్రంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో, సాంకేతిక నిపుణులతో ఉన్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదం రామనాథ్‌పురం జిల్లా, తొండి సముద్రతీర ప్రాంతంలో సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అదనంగా, కోటి రూపాయల…