బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసు టాలీవుడ్‌లో పెద్ద సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు వేగం పెంచింది. గత కొద్ది వారాలుగా ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల పై విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నటుడు విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, రానా దగ్గుబాటి వంటి స్టార్‌లు విచారణకు హాజరై తమ వివరణ ఇచ్చారు. వీరితో పాటు కొన్ని ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను కూడా ఈడీ ప్రశ్నించింది.…