వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఆత్మహత్య చేసుకున్న ఓ నిరుద్యోగి కుటుంబం షాక్ ఇచ్చింది.. తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టిన షర్మిల.. ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ఈసారి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో దీక్ష చేపట్టాలని నిర్ణయించారు.. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్ కుటుంబసభ్యులను పరామర్శించి.. ఆ తర్వాత దీక్ష చేయాలని ప్లాన్.. కానీ, రేపటి షర్మిల నిరసన దీక్షకు…
ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల… ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ప్రతీ వారం ఒక ప్రాంతంలో దీక్ష చేస్తున్న ఆమె.. ఈసారి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో దీక్షకు దిగనున్నారు.. ఈ నెల 24వ తేదీన మంగళవారం లింగాపూర్‌లో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష ఉంటుంది.. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్ ఇంటి…
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వివేక్ కుటుంబం చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వివేక్ రోజుకో పార్టీ మార్చే ఊసరవెల్లి.. దొంగే దొంగ అని అరిచినట్టు వివేక్ విమర్శలు ఉన్నాయన్నారు. దళిత బంధువు పైన వివేక్ తన వైఖరి చెప్పాలి. మీ కార్పొరేట్ రాజకీయాలు చెన్నూర్ గడ్డపైన నడువవు. బడ్జెట్ అనుసరించి త్వరలోనే దళిత బంధు పథకం రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. చెన్నూర్…
కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని భావిస్తూ చాలా చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. థర్డ్ వేవ్ ముప్పు మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని అధికారులు మరోసారి గుర్తుచేస్తున్నారు. అయితే తాజాగా మంచిర్యాల జిల్లాలో.. థర్డ్ వేవ్ దృష్ట్యా డీసీపీ రోడ్డుపై నడుచుకుంటూ ఆ ప్రాంతాల్లో మాస్క్ ధరించని వారిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..…
ప్రభుత్వాసుపత్రి శిథిలావస్థకు చేరుకోవటంతో ఆ మండలంలోని గ్రామాలు ఆందోళన చెందుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం, కుందారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవలే కురిసిన వర్షాలకు కూలిపోయే దశలో వుంది. దీని మరమ్మతులకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆసుపత్రిలోనే కరోనా పేషేంట్లకు చికిత్సలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. భవనంపై నుంచి మట్టి రాలుతుండటంతో ఎప్పుడు కూలిపోతుందోమోననే భయంతో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో…
మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామం శివారులో జైపూర్ ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందారం IK-1A ఓపెన్ కాస్ట్ మైన్ నుంచి బొగ్గు తీసుకెళ్తున్న లారీలను తనిఖీలు చేశారు. ఎలాంటి టార్పాలిన్లు కట్టకుండా మరియు అతివేగంగా వెళ్తున్న 8 లారీలకు రూ.10,400 జరిమానా విధించారు. అయితే గతంలోనూ చాలా సందర్భాల్లో హెచ్చరించిన వినకపోవడంతో ఫైన్ వేశారు. ఇక నుండి టార్పాలిన్ కట్టకుండా, అతి వేగంగా నడిపి ప్రమాదాలకు…
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ మరియు జైపూర్ మండలంలో కోడిపందాలు, పేకాట యథేచ్ఛగా నడుస్తుంది. పక్క సమాచారంతో జిల్లా పోలీసులు వారిని పరుగెత్తించారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగపూర్ గ్రామ శివారులో కోడిపందెం స్థావరంపై పొలీసులు దాడి చేశారు. ఈ ఆకస్మిక దాడిలో ముగ్గురు అరెస్ట్ కాగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 3, 500 నగదు, రెండు పందెం కోళ్లు, 11 కోళ్లకు కట్టే కత్తులు, రెండు…
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు అరుదైన ఘనత దక్కింది. జాతీయ స్థాయిలో జైపూర్ ఎస్టీపీపీ ‘బెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్’ అవార్డు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం, విద్యుత్ పరిశ్రమల్లో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం, మొదలైన విషయాలపై మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ అనే ముంబైకి చెందిన సంస్థ శుక్రవారం నిర్వహించిన వీడియో సెమినారులో ఈ అవార్డు ప్రకటించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ…
కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిల పనిపట్టారు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండల ఏసిపి నరేందర్. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీసులు ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి రావద్దంటూ పలుమార్లు చెప్తున్నా వినట్లేదు. దీంతో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. దీంతో కరోనా సోకుతుందని…
మంచిర్యాల పట్టణంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. లాక్‌డౌన్ అమలు తీరుపై డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ పర్యవేక్షిస్తున్నారు. దీంతో మంచిర్యాల రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అన్ని ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బయట తిరిగేవారిని గుర్తించేందుకు డ్రోన్ నిఘాను ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతినిస్తూ లేనివారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు…