రన్‌వేపై టేకాఫ్ కి సిద్ధంగా ఉన్న విమానంలో అకస్మాత్తుగా ఫైర్ అలారం మోగడం ప్రారంభమైంది. దీంతో విమానం లోపల గందరగోళం నెలకొంది. ప్రయాణికులు ఏదో విధంగా విమానం నుంచి బయటపడటానికి ప్రయత్నించారు. విమానంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి విమానం రెక్కలపైకి ఎక్కి కిందకు దూకారు. రెక్కలపైకి ఎక్కి రన్‌వేపైకి దూకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.