నవతరం దర్శకులు యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ మిక్స్ చేసి మురిపిస్తున్నారు. అలాంటి వారిలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు మలినేని గోపీచంద్. పట్టుమని పది చిత్రాలు తెరకెక్కించక పోయినా, ఇప్పటి దాకా తీసిన వాటితో జనాన్ని భలేగా కట్టిపడేశారు గోపీచంద్. తాజాగా బాలకృష్ణతో గోపీచంద్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఇప్పటికే చిత్రసీమలో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మలినేని గోపీచంద్ 1980 మార్చి 13న ప్రకాశం జిల్లా బొద్దులూరి వారి పాలెంలో జన్మించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గోపీచంద్…