Hardik Pandya: ప్రస్తుతం భారత్-మాల్దీవుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మనదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులను సందర్శించారు. అక్కడ ఉన్న సుందరమైన బీచుల్లో ఆయన పర్యటించిన ఫోటోలను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. లక్షదీవుల్లో పర్యాటకాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అక్కడికి వెళ్లారు.
Maldives Row: ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల లక్షద్వీప్‌ని సందర్శించి అక్కడ పర్యాటకాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవులకు అస్సలు నచ్చడం లేదు. పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన ఆ దేశానికి భారత్ నుంచే ఎక్కువ మంది వెళ్తుంటారు. అయితే ఇటీవల ఏర్పడిన మహ్మద్ మయిజ్జూ ప్రభుత్వం చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. తాజాగా ప్రధాని లక్షద్వీప్ వెళ్లడం ఆ దేశానికి మింగుడు పడటం లేదు.