సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలని అంటుంటారు. అయితే అరుదుగా అలాంటి సినిమాలువస్తుంటాయి. మలయాళంలో ఇటీవల వచ్చిన ‘కురుతి’ సినిమా ఆ కోవకే చెందుతుంది. ‘కురుతి’ అంటే తెలుగులో రక్తం అనే అర్థం వస్తుంది. మనుషుల మధ్య క్షీణిస్తున్న సామరస్యాన్ని, సోదర భావాన్ని చూపించటమే కాకుండా దేవుని పేరిట జరిగే అర్ధ రహిత హింసను హైలైట్ చేస్తూ రూపొందించిన సినిమా ఇది. మను వారియర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్ నిర్మించటం…