తెలుగు సినీ ప్రపంచంలో తన అమోఘ నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి సావిత్రి గారి 90వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని, ‘సావిత్రి మహోత్సవం’ పేరుతో ప్రత్యేక వేడుకలు ఏర్పాటు చేయబడుతున్నాయి. డిసెంబరు 1 నుంచి 6 వరకు హైదరాబాద్ రవీంద్రభారతిలో సంగమం ఫౌండేషన్‌తో కలిసి ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రత్యేక వారోత్సవంలో భాగంగా సావిత్రి నటించిన క్లాసిక్ సినిమాల ప్రదర్శనలు, పాటల పోటీలు మరియు ఆమె కళా…