మహాత్మా గాంధీపై నటుగు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్తాయిలో మండిపడ్డారు. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కి బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ లో నటుడు శ్రీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని, అతడి అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందించారు. Also Read…