Chandra Bose: "మంచు కొండల్లోన చంద్రమా... చందనాలు చల్లిపో..." అంటూ వచ్చిన చంద్రబోస్ తెలుగువారిపై తన కవితాచందనాలు చల్లుతూనే పున్నమినాటి వెన్నెల విహారాల ఆనందాన్ని అందిస్తున్నారు. తన దరికి చేరిన ఏ అవకాశాన్నైనా ఇట్టే వినియోగించుకోగల చంద్రబోస్ వద్ద ఉన్న పదసంపద అగణితం! "చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని..." అంటూ సృష్టిధర్మం చెబుతారు.
(మే 10న గీత రచయిత చంద్రబోస్ పుట్టినరోజు)కొందరికి కొన్ని అలా కలసి వస్తాయి అని చెప్పవచ్చు. చంద్రబోస్ పేరులోనే చంద్రుడున్నాడు, ఇక ఆయన తొలి పాట “మంచు కొండల్లోన చంద్రమా…” అంటూ శ్రీకాంత్ ‘తాజ్ మహల్’ చిత్రంలో పల్లవించింది. అలా ఈ చంద్రుడు తెలుగువారిపై చల్లగా, మెల్లగా తన పాటలతో మత్తు చల్లుతూ వారి అభిమానాన్ని చూరగొన్నారు. చంద్రబోస్ పాతికేళ్ళ పాటల ప్రయాణంలో దాదాపు 800 చిత్రాలలో 3300 పాటలు పలికించారు. ఈ మాట వింటే ఆశ్చర్యం…