Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్. ఐఎంఎఫ్ 1.1 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని ఇస్తే తప్పా పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే అక్కడ ఆహార సంక్షోభం నెలకొంది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఒక వేళ ధరలు పెరిగినా కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్న తగినంత సరకులు అందుబాటులో ఉండటం లేదు. గోధుమ పిండితో పాటు వంటనూనె, చక్కెర ఇలా పలు నిత్యావసరాల కొరత వేధిస్తోంది.