Exoplanet: భూమిని పోలిన గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఎక్కడైనా ఉన్నాయో అని శాస్త్రవేత్తలు ఆరా తీస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో భూమిలాంటి గ్రహాలతో పాటు భూమి కన్నా కొన్ని వందల రెట్లు పెద్దవిగా ఉంటే గ్రహాలను కూడా కనుగొన్నారు. సౌరవ్యవస్థ ఆవల ఉన్న గ్రహాల అణ్వేషణలో భాగంగా మరో కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. దీనికి LP 791-18 d పేరు పెట్టారు. పరిమాణంలో భూమిలా ఉన్నా కూడా ఇది పూర్తిగా అగ్నిపర్వతాలతో కప్పబడి ఉందని గుర్తించారు.