గుమ్మడికాయ గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. గుమ్మడికాయ గింజల్లో ఉన్న పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. వీటిలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో.. మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో సహాయపడతాయి.