Eluru: ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ప్రేమ వివాహం నేపథ్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుడిని ఇనుప స్తంభానికి కట్టేసి రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండవల్లి మండలం కారు కొల్లు గ్రామానికి చెందిన సాయిచంద్ తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన సాయి దుర్గతో తాను ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నానని చెప్పాడు. సాయి దుర్గ ప్రస్తుతం ముసునూరు మండలం రమణక్కపేటలో పోస్టు ఉమెన్‌గా విధులు నిర్వహిస్తోంది.…