Eluru: ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ప్రేమ వివాహం నేపథ్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుడిని ఇనుప స్తంభానికి కట్టేసి రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండవల్లి మండలం కారు కొల్లు గ్రామానికి చెందిన సాయిచంద్ తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన సాయి దుర్గతో తాను ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నానని చెప్పాడు. సాయి దుర్గ ప్రస్తుతం ముసునూరు మండలం రమణక్కపేటలో పోస్టు ఉమెన్‌గా విధులు నిర్వహిస్తోంది.…
కొన్ని ప్రేమ పెళ్లిళ్లు సక్సెస్ అవుతుండగా మరికొన్ని ప్రేమ పెళ్లిళ్లు విషాదంగా ముగుస్తున్నాయి. మనస్పర్థల కారణంగా.. కట్నం డిమాండ్ తో నవ వధువులు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. బక్షి కా తలాబ్ (బికెటి) పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్ భార్య సౌమ్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు, సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది.…