బీహార్‌లో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణికులను ఓ లోకో పైలట్ మధ్య వదిలేసి వెళ్లిపోయాడు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చకుండా మద్యంమత్తులో మునిగితేలాడు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి లోకల్ రైలు సహర్సాకు బయలుదేరింది. గంట ప్రయాణం తర్వాత రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు క్రాసింగ్ ఇచ్చేందుకు ఓ చోట ఆగింది. దీంతో లోకో పైలెట్ రైలు దిగి వెళ్లిపోయాడు. అయితే క్రాసింగ్ తర్వాత కూడా రైలు ఎంతకీ కదల్లేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చేయడంతో…