Deccan Mall Fire : సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. నిన్నటి నుంచి ఆచూకీ లభించని వ్యక్తులు సజీవ దహనమయ్యారు. బిల్డింగులో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు.
సికింద్రాబాద్ లోని మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటన నగరం ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను ఫైర్ సిబ్బంది కాపాడారు. అయితే మరో ముగ్గురు గల్లంతయ్యారని వస్తున్న వార్తలపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు.