హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ పేరు తెలియని సినీఫ్యాన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. జేమ్స్ తెరకెక్కించిన ‘అవతార్’ మొదటి భాగం విడుదలై ఈ యేడాదికి 13 ఏళ్ళయింది. ఆ సినిమాకు సీక్వెల్ గా ‘అవతార్ -2’ ఈ యేడాది డిసెంబర్ 16న జనం ముందుకు రానుంది. ‘అవతార్-1’ విడుదలై పుష్కరకాలం దాటినా ఇంకా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టాప్ గ్రాసర్స్ లో నంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం! ‘అవతార్’ మొదటి భాగం పదమూడేళ్ళ క్రితమే 2,847,246,203 అమెరికన్…