మరో తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో యాస్ తుఫాన్ గంటకు 04 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ బలపడుతోంది.. ప్రస్తుతం.. పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 520 కిలోమీటర్లు.. బాలసోర్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిఉంది.. ఉత్తర-వాయువ్య దిశగా పయనించి తీవ్రమైన తుఫాన్‌గా మారుతోంది.. ఈనెల 26 తెల్లవారుజామున అతితీవ్ర తుఫానుగా మారి.. పారాడిప్, సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలను దాటవచ్చు అని భారత వాతావరణశాఖ అంచనా…