తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావుకు సతి వియోగం కలిగింది. ఆయన భార్య లక్ష్మీ కళ్యాణీ చెన్నయ్ లో శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సింగీతం శ్రీనివాసరావు తెలిపారు. 62 సంవత్సరాల తమ దాంపత్య జీవితానికి తెరపడిందని ఆయన అన్నారు. యుక్త వయసులోనే చిత్రసీమలోకి అడుగుపెట్టిన సింగీతం శ్రీనివాసరావుకు అరవైయేళ్ళకు పైగా ఆమె చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్…