India Pakistan Tension: ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల తర్వాత భారత్ మరోసారి పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం కరాచీ, లాహోర్, సియాల్‌కోట్, రావల్పిండి సహా 10 నగరాలపై డ్రోన్ అటాక్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పాకిస్తాన్ ‘‘గగనతల రక్షణ వ్యవస్థ’’ టార్గెట్ చేసినట్లు సమాచారం. దీంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైంది. పాకిస్తాన్ దాడులు చేస్తుందనే అనుమానం నేపథ్యంలో భారత్ ఈ రక్షణ వ్యవస్థల్ని నాశనం చేసినట్లు తెలుస్తోంది.