ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని వ్యవసాయ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. దుక్కి దున్నడం, విత్తనం నాటడం, పంట కోత ఇలా ప్రతి పనిలో యంత్ర పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు రైతులకు ప్రయోజనం చేకూరేలా సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నాయి. CES 2026లో, జపనీస్ కంపెనీ కుబోటా తన కొత్త కాన్సెప్ట్, ట్రాన్స్‌ఫార్మర్ రోబోట్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది. ఈ ట్రాక్టర్ కేవలం వ్యవసాయ యంత్రం మాత్రమే కాదు, అనేక వ్యవసాయ పనులను స్వయంగా చేయడానికి రూపుదిద్దుకున్న బహుముఖ రోబోటిక్ ప్లాట్‌ఫామ్.…