భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ 2025 దిగ్విజయంగా కొనసాగుతోంది. నవంబర్ 1న ప్రారంభమైన కోటి దీపోత్సవం.. 8 రోజుల పాటు విశేష కార్యక్రమాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి.. దీపాలు వెలిగిస్తున్నారు. ప్రతి రోజు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కైలాసాన్ని తలపిస్తోంది. కోటి దీపోత్సవంలో నేడు 9వ రోజు.…