పేరుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. కానీ… పిలిచి టిక్కెట్ ఇచ్చే దిక్కులేదు. రమ్మని పిలిచే పార్టీ లేదు. నువ్వొస్తానంటే మేమొద్దంటామని ముఖం మీద తలుపేసేవాళ్ళు తప్ప మాజీ మంత్రి సీనియారిటీని వాడుకుందామనుకునే వాళ్ళు మాత్రం లేరు. చివరికి ఇప్పుడు చేరిన పార్టీలో కూడా వితౌట్ కండిషన్స్ అంటున్నారట. ఇంతకీ అంత దారుణమైన స్థితిలో ఉన్న నాయకుడెవరు? ఎందుకంత దుస్థితి దాపురించింది? కొత్తపల్లి సుబ్బారాయుడు….. పశ్చిమగోదావరి జిల్లాలో సీనియర్ లీడర్. ఓటమి ఎరుగని నేతగా ట్యాగ్‌లైన్. కానీ… అదంతా…