ఎందరో ప్రతిభావంతులు తమదైన బాణీ పలికిస్తూ తెలుగు సినిమా రంగంలోనూ రాణిస్తున్నారు. కోరుకున్న తీరాలను చేరుకొని ఆనందిస్తున్నారు. అలాంటి వారిలో దర్శకుడు కొరటాల శివ ఒకరు. ఆరంభంలో రచయితగా అలరించన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడయ్యారు. తొలి చిత్రంతోనే జయకేతనం ఎగరేశారు. మొన్న ‘ఆచార్య’తో మొదటి మల్టీస్టారర్ నూ జనం ముందు నిలిపారు. కొరటాల శివ 1975 జూన్ 15న గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు. కొరటాల శివలో ప్రతీ అంశాన్ని హేతువాద కోణంలో పరీక్షించే…