సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ దళం (RSAF) మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆదివారం రాజధాని ఖార్టూమ్‌లోని మార్కెట్‌లో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది చనిపోయారు. దాదాపు 36 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు.
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని దక్షిణ భాగంలో శనివారం జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు చిన్నారులు సహా 17 మంది మరణించారు. ఈ మేరకు శనివారం ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.