బెజవాడ టీడీపీలో అగ్గి రాజుకున్నట్టే కన్పిస్తోంది. నిన్నటి వరకు ఎంపీ కేశినేని నాని వర్సెస్ మిగిలిన లీడర్లు అన్నట్టుగా ఉండేది. కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ వంటి వారు రాజకీయం చేసేవారు. బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ.. ఆ తర్వాత ఒకట్రోండు సందర్భాల్లోనూ గొడవలు బహిర్గతమైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయి.. కేశినేని నాని పార్టీ అధినాయకత్వంతో సఖ్యతగా ఉండడం మొదలు పెట్టారు. అయితే బెజవాడ…