కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ లో ఏ మాత్రం కొత్తదనం ఉన్నా నటీనటుల గురించిన ఆలోచన చేయకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే నూతన నటీనటులు వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అలాంటి చిత్రమే ‘కిరోసిన్’. గతంలో తెరపై రాని ఓ సరికొత్త క్రైమ్ థిల్లర్ కథను తయారు చేసుకున్న ధృవ తానే స్క్రీన్ ప్లే, మాటలు రాసుకుని ప్రధాన పాత్రనూ ఇందులో పోషించారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్…