అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా ఇచ్చారు. కిష్టయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థిక సాయం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నట్లు కేసీఆర్ పత్రికా ప్రకటనలో తెలిపారు.