KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ ఎన్నికలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారు. రేపు ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జ్‌లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు కేసీఆర్. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి తగిన వ్యూహం రూపకల్పనపై చర్చలు జరగనున్నాయి.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ప్రచారంలో ప్రత్యర్థులు విమర్శలు, ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు. అయితే.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ చర్యలు నేటి రాత్రి 8గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అనుచిత…