ఫెడరల్ ఫ్రంట్ కోసం అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్‌లో గులాబీ దళపతి కేసీఆర్ ఉన్నారా? పైకి చెప్పకపోయినా.. ఆ పనిలో పూర్తిస్థాయిలో పావులు కదుపుతున్నారా? గతంలో DMK.. తాజాగా లెఫ్ట్ పార్టీల అగ్రనేతలతో భేటీ తర్వాత కేసీఆర్ తదుపరి కార్యాచరణ ఏంటి? రెండేళ్ల ముందే జాతీయస్థాయి రాజకీయ పరిణామాలపై చర్చ2024 సార్వత్రిక ఎన్నికలకు జాతీయస్థాయిలో బీజేపీని బలంగా ఢీకొట్టే వారు ఎవరు? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో దీనిపైనే చర్చ. ఎవరికి వారు బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.…