ప్రముఖ కన్నడ దర్శకుడు గురుప్రసాద్ మృతి చెందడంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన భార్య సుమిత్ర గురుప్రసాద్ తన భర్త మృతికి గల కారణాలపై విచారణ జరిపించాలని కోరుతూ మదనాయకనహళ్లి పోలోస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గురుప్రసాద్ భార్య బెంగళూరు రూరల్ జిల్లా, నెలమంగళ తాలూకా, మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పులు తీసుకోవద్దని గురుప్రసాద్ కు చెప్పాను. అయినా అప్పులు చేశారు. నా భర్త ఆత్మహత్య చేసుకుంటాడనడంలో సందేహం లేదు.…