పార్లమెంట్‌లో జరిగిన అఖిలపక్ష భేటీలో టీడీపీ తరపున కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ పాల్గొన్నారు. సమావేశ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పలు అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు సూచించారు. ముఖ్యంగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు కోరినట్టు తెలిపారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ర్ట ప్రభుత్వం తగ్గించలేదని చెప్పామన్నారు. దీనిపై ఏకీకృత నిబంధనలు తీసుకొచ్చి దేశమంతా ఒకే ధర ఉండేలా చూడాలని కోరినట్టు వెల్లడించారు. విశాఖ ఉక్కు, ఇతర సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని…