జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈ దాడికి బాధ్యతను టీఆర్‌ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ తీసుకుంది. ఈ సంస్థ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే, టీఆర్‌ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా…