పెళ్లి చేసుకోవాలనుకునే పేదలకు టీటీడీ అధికారులు గుడ్‌న్యూస్ అందించారు. ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ చేపట్టిన కళ్యాణమస్తు కార్యక్రమానికి నేటి నుంచి ఈనెల 20 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 7న వీరికి ఉచిత సామూహిక వివాహాలు చేయనున్నారు. కళ్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న నూతన వధూవరులకు ఉచితంగా 2 గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండిమెట్టెలు, పెళ్లి వస్త్రాలు,…