కైకాల సత్యనారాయణని చూడగానే ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఆయన ఆహార్యం అచ్చ తారకరాముడి లాగే ఉంటుంది. అందుకే ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాల్లో తారకరామారావుకి డూపుగా కైకాల సత్యనారాయణ నటించాడు. ఆయన హఠాన్మరణం టాలీవుడ్ ని కుదిపేసింది. ఊహించని ఈ మరణ వార్త గురించి నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ… “కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస…