పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. న్యాయ వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ 5 లక్షల ఫైన్ విధించిన న్యాయ స్థానం.. జడ్జిలపై మమత తప్పుడు ఆరోపణలు సరికాదని పేర్కోంది. నందిగ్రామ్ ఎన్నికల లెక్కింపునకు సంబంధించిన కేసును విచారిస్తున్న కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌషిక్ చందాకు.. బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. కౌషిక్ చందాను ఆ కేసు నుంచి తప్పించి.. పిటిషన్‌ను మరొక జడ్జికి…