Lawyers Boycott Court : న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఏపీ బార్ కౌన్సిల్ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రంలోని 14 బార్ అసోసియేషన్ల అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది.