ఇటీవల మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.మలయాళ దర్శక నిర్మాతలు తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని తమ సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. అలాగే ఓటీటీలో కూడా మలయాళ సినిమాలకు బాగా క్రేజ్ ఏర్పడింది.గతంలో విడుదల అయి సూపర్‌హిట్‌గా నిలిచిన పలు సినిమాలను తెలుగులో డబ్ చేసి డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. అలా ఇటీవల మలయాళం నుంచి వచ్చిన 2018, నెయ్‌మార్, పద్మిని…