అల్ పచినో పేరు వినగానే ఆయన నటించిన అనేక చిత్రరాజాలు మన మదిలో మెదలుతాయి. ముఖ్యంగా “గాడ్ ఫాదర్, సెర్పికో, డాగ్ డే ఆఫ్టర్ నూన్, డిక్ ట్రేసీ, సెంట్ ఆఫ్ ఏ ఉమన్” వంటి చిత్రాలు గుర్తుకు రాకమానవు. ‘సెంట్ ఆఫ్ ఉమన్’తో బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ ను సొంతం చేసుకున్న అల్ పచినో 83 ఏళ్ళ వయసులోనూ ఉత్సాహంగా ఉన్నారు. నటించడానికి సై అంటున్నారు. మూడేళ్ల క్రితం వెలుగు చూసిన ‘ది ఐరిష్…