జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించింది. రాంచీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.