(మార్చి 22న సుమ కనకాల పుట్టినరోజు)కోటలు దాటే మాటలు అంటారు కానీ, మాటలతో కోటలు కట్టిన మేటి మాటకారి సుమ కనకాల. తెలుగునాట వ్యాఖ్యాతలు సైతం సెలబ్రిటీ స్టేటస్ చవిచూస్తారని నిరూపించిన ఘనత సుమ సొంతం. నటి కావాలని పాతికేళ్ళ క్రితం బయలు దేరిన సుమ, వెండితెరపై అంతగా వెలగలేదు. కానీ, వందలాది చిత్రాలు వెండితరపై వెలగబోయేముందు జరిగే ఉత్సవాలలో మాత్రం సుమ గాత్రం విజయనాదం చేస్తూనే ఉంది. ఆమె వ్యాఖ్యానంతో సాగిన సినిమా ఉత్సవాలు, విజయోత్సవాలు…