యంగ్ హీరో నాగశౌర్య నటించిన రెండు సినిమాలు ఈ యేడాది ద్వితీయార్థంలో విడుదలయ్యాయి. చిత్రం ఏమంటే ఈ రెండు చిత్రాల ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగశౌర్య, రీతువర్మ జంటగా నిర్మించిన ‘వరుడు కావలెను’ మూవీతో లక్ష్మీ సౌజన్య తొలిసారి మెగాఫోన్ పట్టింది. ఇది అక్టోబర్ 29న విడుదల కాగా ఈ డిసెంబర్ 10న నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ మూవీ జనం ముందుకు వచ్చింది. బాధాకరం…
మేగ్నమ్ ఓపస్ మూవీ, రియల్ మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’ రిలీజ్ డేట్ ను దర్శక ధీరుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ మూవీని వచ్చే యేడాది జనవరి 7వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా రాజమౌళి తెలిపాడు. ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను జనవరి 7 ఎక్స్ పీరియన్స్ చేయొచ్చని రాజమౌళి ట్వీట్ లో పేర్కొన్నాడు. రిలీజ్ డేట్ ను…