పాండోరా ప్రపంచం మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమైంది! అకాడమీ అవార్డు గ్రహీత, దిగ్గజ దర్శకుడు జేమ్స్ కేమరాన్ సృష్టించిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ సినిమా మళ్లీ థియేటర్లలో విడుదలవుతోంది. ఈ రీ-రిలీజ్ ప్రేక్షకులకు మరపురాని సినిమాటిక్ అనుభవాన్ని అందించడమే కాకుండా, రాబోయే అవతార్: ఫైర్ అండ్ ఆశ్ నుంచి ఎవరూ చూడని ఎక్స్‌క్లూసివ్ స్నీక్ పీక్‌ను కూడా ప్రదర్శించనుంది. ఈ ప్రత్యేక స్క్రీనింగ్ అక్టోబర్ 2, 2025 నుంచి ఒక వారం పాటు…