సినీ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) మృతి చెందారు. వయోభారంతో మూడు రోజుల క్రితం అస్వస్థ తకు గురైన ఆయన శనివారం రాత్రి స్వగ్రామమైన బాపట్ల జిల్లా కారంచేడులో తుదిశ్వాస వి డిచారు. రాధాకృష్ణమూర్తి పలు చలన చిత్రాలను నిర్మించారు. ‘ఒక దీపం, వియ్యాలవారి కయ్యాలు, శ్రీ వినాయక విజయం, కోడళ్లు వస్తున్నారు. జాగ్రత్త, కోరుకున్న మొగుడు, ప్రతిబింబాలు’ లాంటి పలు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. రాధాకృష్ణ మూర్తి భార్య శాంతమ్మ మూడేళ్ల క్రితం మరణించారు.…