తిరుపతిలో జనసేన పార్టీ వినూత్నంగా నిరసన చేపట్టింది. ఇటీవల జగన్ ఒంగోలు పర్యటన సందర్భంగా ఓ కుటుంబం తిరుపతి వెళ్తుండగా రవాణాశాఖ అధికారులు బలవంతంగా కారు తీసుకెళ్లడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా సీఎం జగన్ తిరుపతి పర్యటన ఖరారు కావడంతో జనసేన పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. తిరుపతి నగరంలోని బైరాగి పట్టెడ పార్క్ వద్ద ‘జగన్ వస్తున్నాడు కార్లు జాగ్రత్త’ అంటూ వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, పట్టణ…
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి సహాయక చర్యలు అందించారు. వాగులు, వంకలు పొంగిపొర్లి వరద నీరు గ్రామాల్లోకి చేరింది. అంతేకాకుండా చెరువులకు గండ్లు పడడంతో కట్ట కింద ఉన్న పంటపొలాలు కొట్టుకుపోయాయి. పశువులు కూడా కొట్టుకుపోయి తీవ్ర ఆస్తినష్ట, ప్రాణ నష్టం కూడా సంభవించింది. దీంతో సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు,…