Petrol Rates : పాకిస్తాన్ లో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. ఏకంగా ఒక్కరోజులోనే అక్కడ ప్రభుత్వం ఏకంగా పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు రూ.35పెంచేసింది. పెంచిన ధరలు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు.
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తరుణంలో ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధి బాధ్యతను భగవంతుడైన అల్లాహ్‌పై ఉంచారు.