మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ మహా సంగ్రామం మొదలవబోతుంది. అందుకోసం అన్నీ జట్లు తమ హోంగ్రౌండ్‌లలో కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అందులో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న అభిషేక్ శర్మ.. తన అద్భుత షాట్లతో చెప్పి మరీ స్టేడియంలోని అద్దాలను పగలగొట్టాడు.