భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు వారం పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. శనివారం కాల్పుల విరమణ అంగీకారంతో.. భారత్, పాక్ మధ్య యుద్ధం ముగిసింది. యుద్ధం ముగియడంతో ఐపీఎల్ 2025ను పునఃప్రారంభించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలెట్టింది. భారత ప్రభుత్వం టోర్నీకి అనుమతిస్తే.. మే 15 లేదా 16న ఐపీఎల్ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మే 30న ఐపీఎల్ 2025 ఫైనల్ జరగనుందని తెలుస్తోంది. ఈరోజు రాత్రికి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం…